‘గాడ్ ఫాదర్’ సెన్సార్ పూర్తి

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసారు.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి ‘U/A’ (యూ/ఏ) సర్టిఫికేట్ జారీ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ దసరా ఒక వ్యక్తి గురించి మరియు అతను మిగిలిన వారిలో కలిగించే భయం గురించి చూపిస్తుంది అని పేర్కొన్నారు. సినిమాకు సెన్సార్ సభ్యులు నుండి మంచి ప్రశంసలు వచ్చాయని దర్శకుడు మోహన్ రాజా ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ని ఆవిష్కరించగా.. మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆర్బి చౌదరి – ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.