నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో భేటీ

PM Modi At Union Cabinet Meeting
PM Modi At Union Cabinet Meeting

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలో ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరగబోయే కేబినెట్‌ భేటీలో ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా కేంద్ర ఆర్థిక, భద్రత కేబినెట్‌ కమిటీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కరోనా, లాక్‌డౌన్‌ అంశాలతో పాటు లద్దాఖ్‌లో చైనా దుందుడుకు చర్యలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/