మరోసారి కరోనా మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం

ఆగస్ట్ 31 వరకు నిబంధనల పొడిగింపు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆగస్ట్ 31వ తేదీ వరకు నిబంధలను పొడిగించింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా నిబంధనలను పాటించాలని పేర్కొంది.

వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేసింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలను సడలించే వెసులుబాటును ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర కల్పించింది. కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా, కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/