రేపు బీహార్‌ పర్యటనకు వెళ్లనున్న సిఎం కెసిఆర్‌

గల్వాన్‌ అమర జవాన్‌ కుటుంబాలకు సాయం
సికింద్రాబాద్‌ వలస కార్మికులకూ ఆర్థిక వితరణ

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్ః సిఎం కెసిఆర్‌ రేపు( బుధవారం) బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్‌ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్‌ లోయలో అమరులైన బీహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు.

సికింద్రాబాద్‌ టింబర్‌ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్‌ వలస కార్మికుల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున సిఎం కెసిఆర్‌ ఆర్థికసాయం అందిస్తారు. బీహార్‌ సిఎం నితీశ్‌కుమార్‌తో కలిసి అమర జవాన్లు, కార్మికుల కుటుంబాలకు చెకులు పంపిణీ చేస్తారు. అనంతరం సిఎం నితీశ్‌కుమార్‌ ఆహ్వానం మేరకు అధికారిక నివాసంలో కెసిఆర్‌ మధ్యా హ్న భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/