సూపర్ స్టార్ కృష్ణ కు బర్త్ డే విషెష్ తెలిపిన చంద్రబాబు , నారా లోకేష్

సూపర్ స్టార్ కృష్ణ 79 వ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ఆయనకు అభిమానులు , చిత్రసీమ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , చంద్రబాబు , రఘురామ కృష్ణం రాజు లు కృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివి. ఆయన మరిన్ని ఆనందకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను..’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ప్రముఖ సినీ నటులు, నిర్మాత, దర్శకులు ఘట్టమనేని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను ఆనంద ఆరోగ్యాలతో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

‘లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నాను..’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ట్వీట్ చేశారు.

ఇక కృష్ణ తనయడు, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..! మీలాంటి వారు నిజంగా ఎవరూ లేరు. రాబోయే చాలా రోజుల్లో మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ..’ అని ట్వీట్ చేశారు. అలాగే మహేష్ తనయ సితార కూడా తన తాతకు క్యూట్ విషెస్ చెప్పింది.

తన తాతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఈ రకంగా పోస్ట్ పెట్టేసింది. మీ పుట్టిన రోజును ఇలా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.. హ్యాపీ బర్త్ డే తాత గారు.. లవ్యూ సో మచ్.. అని ప్రేమను కురిపించింది.