‘బిగ్‌బాస్ 5’ విన్నర్ సన్నీ కొత్త చిత్రం ప్రారంభం

‘బిగ్‌బాస్ 5’ విన్నర్ వీజ్ సన్నీ కొత్త చిత్రం ఈరోజు మంగళవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. A2B ఇండియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా.. రంజిత్ రావ్.బి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అన్‌స్టాపబుల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ‘నో డౌట్ 100 పర్సంట్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనేది ఉపశీర్షిక.

‘సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు మాటలు అందించిన డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల మధ్య ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్ హీరో వి.జె సన్నీపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇక ఈ మూవీ లో సప్తగిరి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

చిత్ర ప్రారంభోత్సవం అనంతరం మీడియా తో హీరో సన్నీ మాట్లాడుతూ.. దర్శకుడు డైమండ్ రత్నబాబుకు సినిమా అంటే పిచ్చి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడిగా నేను 100 శాతం కష్టపడి పని చేస్తాను. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతలతో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటులెందరో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే దిల్ రాజు గారు, హరీష్ శంకర్‌ గారి ఆశీస్సులతో త్వరలోనే మరో సినిమా చేయబోతున్నాను..’’ అని చెప్పుకొచ్చాడు.