టీడీపీ విజయంపై NTR ట్వీట్.. స్పందించిన చంద్రబాబు

ఏపీలో కూటమి సంచలన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి స్థానాలు గెలవడం తో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 , 25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 దక్కించుకొని ఆశ్చర్యపరిచారు. జనసేన , టిడిపి , బిజెపి మూడు పార్టీల సమిష్టి కృషి వల్లే ఈరోజు ఎంత పెద్ద విజయం సాధించామని మూడు పార్టీల నేతలు చెపుతున్నారు. ఇక ఈ విజయం పాట చిత్రసీమ ప్రముఖులు కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. చిరంజీవి , అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ఎంతో మంది విషెష్ తెలియజేయగా..నందమూరి హీరోలు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు అభినందనలు తెలియజేయడం టిడిపి శ్రేణులను సంతోషానికి గురి చేస్తుంది.

గత కొంతకాలంగా ఎన్టీఆర్ టిడిపి కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కానీ , ఎన్నికల ప్రచారం లో కానీ ఇలా ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఈరోజు కూటమి విజయం సాధించడం ఫై స్పందించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

“ప్రియమైన చంద్రబాబు మామయ్యకి… ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు” అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. అలాగే మరో ట్వీట్ లో పవన్ కల్యాణ్ కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

ఇక కళ్యాణ్ రామ్ : ‘‘మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడవ సారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. అలాగే భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేశ్, శ్రీభరత్, అత్తయ్య దగ్గుబాటి పురందేశ్వరి గారికి నా శుభాకాంక్షలు’’ అని కల్యాణ్ రామ్ పేర్కొన్నాడు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికే వీరందరికీ శుభాకాంక్షలు తెలిపిన సంగతి విదితమే.

చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన @ncbn మావయ్యకీ, @JaiTDP నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!
మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.

వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం…— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024

ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.

అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…— Jr NTR (@tarak9999) June 5, 2024

దీనిపై చంద్రబాబు స్పందించారు. ‘థాంక్యూ వెరీ మచ్ అమ్మ’ అంటూ జూ. ఎన్టీఆర్ కు బదులిచ్చారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్ , మహేశ్ బాబు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం ఆయన ధన్య వాదాలు తెలిపారు.