‘స్వాతిముత్యం’ నుండి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

బెల్లం కొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గణేష్ హీరోగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వాతి ముత్యం అనే సినిమాను నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో.. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా మేకర్స్ సినిమాలోని వెడ్డింగ్ సాంగ్ ను ఈరోజు బుధువారం రిలీజ్ చేసారు.

మహతి సాగర్ స్వరపరిచిన ఈ పాట మ్యారేజ్ వైబ్స్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ వెడ్డింగ్ సాంగ్ కూడా శ్రోతలను అలరించేలా ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ప్రధాన హైలైట్ గా నిలవబోతోంది. ఇక అక్టోబర్ 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ లో రావు రమేష్ , సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్థన్ , పమ్మిసాయి , గోపరాజు, రమణ శివనారాయణ , సురేఖా వాణి, సునైనా , దివ్యశ్రీపాద తదితరులు నటిస్తున్నారు.