న్యూజిలాండ్‌లో యాక్టివ్ కేసులు జీరో

సంతోషంతో ద్యాన్స్‌ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

New Zealand says it has zero active cases of Covid-19

విల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జసిండా అర్డర్న్ వెల్లడించారు. స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. న్యూజిలాండ్‌లో కరోనా బారినపడిన చివరి వ్యక్తి.. కోలుకున్నాడని తెలిపారు. గత 17 రోజులుగా దేశంలో కొత్త కేసులు నమోదు కావడం లేదని చెప్పిన ఆమె.. న్యూజిలాండ్‌ను కరోనా ఫ్రీగా దేశంగా ప్రకటించారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా ప్రధాని సంతోషంతో ద్యాన్స్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. న్యూజిలాండ్‌లో కరోనా వైరస్‌ను తరిమికొట్టామన్న నమ్మకం ఇప్పుడు కలిగిందన్నారు. ఇప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదన్నారు.

ఐదు మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో 1,154 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారందరూ కోలుకున్నారు. గత 17 రోజుల నుంచి ఏ ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఒక వారంలో ఒక కేసు మాత్రమే నమోదైంది. ఆ వ్యక్తి కూడా ఈ వైరస్‌ నుంచి కోలుకున్నాడు. ఇక ఆంక్షలన్నింటినీ ఎత్తివేసి అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రజా రవాణాకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/