హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్న ప్రభుత్వం

స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం

ap high court
ap high court

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను ఏపి ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. మరోవైపు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టులో బిజెపినేత కామినేని శ్రీనివాస్ కేవియట్ దాఖలు చేశారు. తమ పార్టీ అధిష్ఠానం అనుమతితోనే తాను ఈ పిటిషన్ వేశానని ఆయన తెలిపారు. కాగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ మే 29న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/