కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థపై దృష్టి

సీఐఐ 122వ వార్షికోత్సవం సందర్భంగా మోడి ప్రసంగం

YouTube video
PM Modi inaugurates Confederation of Indian Industry’s (CII) Annual Session 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) 122వ వార్షికోత్సవం సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నామని మోడి తెలిపారు. దేశంలో తాము కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టామని చెప్పారు. దీర్ఘకాల దృష్టితో చర్యలు తీసుకుంటున్నామని మోడి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు ‘ఐ’లపై దృష్టి సారించామని తెలిపారు. ఇంటెంట్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌లపై దృష్టి పెట్టామని వివరించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మోడి చెప్పారు. భారత ఆవిష్కరణలపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉందని తెలిపారు. విపత్కర సమయంలో తాము ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/