సీఎం కేసీఆర్ ను కలిసిన నాగం..బిఆర్ఎస్ లోకి ఫిక్స్ ..?

నాగర్‌ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్దన్ రెడ్డి..కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. అనంతరం బిఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు తో పాటు పలువురు నాగం ను కలిసి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం నాగం..ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.

తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపుపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నా వారిని కాదని..ఒకటి , రెండ్రోజుల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్‌లు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌ కర్నూల్‌ టికెట్ ను కాంగ్రెస్‌ తనకు ఇస్తుందని భావించిన నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీ హైకమాండ్ మొండి చేయిచూపడంతో పార్టీకి రాజీనామా చేశారు.