అమెరికాలో 24 గంటల్లో 743 మంది మృతి
మొత్తం మృతుల సంఖ్య 105099

అమెరికా: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ వల్ల 743 మంది మరణించారు. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 105099కి చేరుకున్నది. ఆ దేశంలో మొత్తం కరోనా కేసులు లక్షా 80 వేలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వల్ల ఇప్పటి వరకు 373439 మంది మరణించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/