కర్నూలు లో రూ.1 కోటి 80 వేల నగదు పట్టివేత

హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న కారు

money
money

కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ వాహనంలో రూ.1 కోటి 80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళుతున్నట్టు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసిన అనంతరం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటివలే చెన్నై వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండగా, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఈ వ్యవహారంలో బాగా వినిపించింది. ఆ తర్వాత ఆ డబ్బు తనదేనంటూ ఒంగోలుకు చెందిన జ్యూయెలరీ షాపు యజమాని పోలీసులకు చెప్పాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/