నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా అంటూ చంద్రబాబు ఫైర్

chandrababu-slams-ysrcp

బుధువారం విజయవాడ లో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో జ‌య‌హో బీసీ స‌భ‌ ఏర్పటు చేసారు. ఈ సభ కు సీఎం జగన్ తో పాటు వైస్సార్సీపీ నేతలంతా హాజరై చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో చంద్రబాబు వైస్సార్సీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. జగన్ రెడ్డికి నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. విజయవాడ వైసీపీ సభకు బీసీలను బలవంతంగా తీసుకొచ్చారని ఆరోపించారు.

వైస్సార్సీపీ సభకు రాకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరించారని మండిపడ్డారు. వైస్సార్సీపీ తమ సభలకు బెదిరించి తీసుకెళ్తారని , టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తారని చంద్రబాబు వెల్లడించారు. వైస్సార్సీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ రెడ్డి తోకను త్వరలోనే కట్ చేస్తామని హెచ్చరించారు.