టిడిపి అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె గొల్ల బాబు ఫిర్యాదు

chandrababu
chandrababu

విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో పాయకరావు పేట వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే గొల్ల బాబు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు దళితుల్ని అవమాన పరిచేవిధంగా మాట్లాడుతున్నారన్నారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబుకు మేం ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదన్నారు. దళితుల్ని ఆయన గతంలో కూడా అనేకసార్లు అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబుపై పోరాడేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు గొల్లబాబు. తాజాగా చంద్రబాబు నాయుడుకు ఐదుగురు మంత్రులు ఇదే విషయమై బహిరంగ లేఖ కూడా రాశారు. బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ పై చంద్రబాబు చవకబారు విమర్శలు చేశారని మండిపడ్డారు. విజయ్ కుమార్ గారిని… విజయ్ కుమార్ గాడు అనడం ద్వారా చంద్రబాబు తన కుల దుహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారన్నారు. బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించారని మంత్రులు లేఖలో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/