పోలీసుల ప్రకటనలు అర్థరహితం
మందడం గ్రామస్థుల ఆగ్రహం

అమరావతి: రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దౌర్జన్యానికి, పోలీసులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితంగా ఉన్నాయని మందడం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నేపథ్యంలో పై విధంగా స్పందిచారు. మందడంలో మహిళలు పోలీసులపైకి ఎదురుతిరిగారని, మహిళా కానిస్టేబుళ్లపై దాడికి దిగారని తూళ్లూరు డిఎస్పి వెల్లడించారు. దాడికి సంబంధించిన ఫోటోలను చూపించారు. అయితే ఇందులో వాస్తవం లేదని మహిళలను తప్పించే క్రమంలో దురుసుగా ప్రవర్తించామని పోలీసులే తెలిపారని మందడం గ్రామస్థులు అంటున్నారు. అయితే ఈ విషయాలను ఎందుకు ఇంత ఆలస్యంగా వెల్లడిచారని అడగగా.. సమాధానాన్ని దాటవేసిన పోలీసులు.. నేడు రాజధాని గ్రామాల్లో పాదయాత్రకి అనుమతి లేదని చెప్పారు. అంతేకాకుండా పోలీసులు ఎవరిపై ఆధారపడి ఉండరని తామే మంచినీళ్లు, టిఫిన్, భోజనం వసతులు ఏర్పాట్లు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/