కృష్ణా జిల్లాలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టడం లేదు. గత పది రోజులుగా రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఉరుములతో కూడిన వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణ లో మరో నాల్గు రోజుల పాటు వర్షాలు కురవనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది.

గుడివాడలో భారీ ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడ పిడుగులు పడడంతో ప్రజలు భావంతో వణికిపోయారు. భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే పామర్రులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెదమద్దాలిలో పిడుగుపాటుకు రెండు చూడి గేదెలు మృతి చెందాయి.

అలాగే కొమరవోలులో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు ఇస్సాకు అనే రైతు గాయపడ్డాడు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వరద ప్రభావంతో రహదారులు జలమయమయ్యాయి. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. అలాగే విజయనగరంలో కుండపోత వర్షం కురిసింది. ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం కురిసింది.