‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ అవార్డు

ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ఎంపిక

National Award for 'F2'
National Award for ‘F2’

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు అవార్డులు ప్రకటించింది.

తాజాగా గెజిట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ”ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫస్ట్రేషన్” చిత్రానికి కేంద్ర అవార్డు లభించింది.

ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘F2’కు ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో తమిళ్ నుంచి ‘హౌస్ ఓనర్’.. హిందీ నుంచి ‘ఉరి’ ‘గల్లీ బాయ్’ ‘సూపర్ 30’ ‘బదాయి హో’..

మలయాళం నుంచి ‘జల్లికట్టు’ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. అయితే ఈ అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా ‘ఎఫ్ 2’ కావడం విశేషం.

కాగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. థియేటర్ లోనే కాకుండా టీవీలోనూ ఈ మూవీ మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది.

విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా – మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

రాజేంద్ర ప్రసాద్ – ప్రకాష్ రాజ్ – సుబ్బరాజు – ప్రగతి – నాజర్ – అన్నపూర్ణమ్మ – వై. విజయ – అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ‘ఎఫ్ 2’ చిత్రాన్ని నిర్మించారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/