పోసాని ఫై కేసు నమోదు

case file on posani

నటుడు , వైస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళి ఫై పోలీస్ కేసు నమోదు అయ్యింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై, జనసేన పార్టీ కార్యకర్తల ఫై , జనసేన వీరమహిళల ఫై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై పోలీసులు ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోసానిపై గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రెండో జేఎఫ్‌సీఎం కోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరిపించి , చివరికి, పోసానిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.