తెలుగులో అరుదైన రికార్డు నెలకొల్పిన కాంతార

కన్నడ మూవీ కాంతార ఇప్పటికే అనేక భాషల్లో అనేక రికార్డ్స్ నెలకొల్పి , అందర్నీ ఆశ్చర్య పరచగా..తాజాగా తెలుగు లో మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబరు 30న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని.. అక్టోబరులో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలైంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా ఒక్క తెలుగులోనే ఏకంగా రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కలెక్షన్ల పరంగా చూసుకుంటే అత్యధికంగా వసూలు చేసిన డబ్బింగ్ సినిమా జాబితాలో కాంతార నాల్గో స్థానంలో నిలిచింది. లెక్కల పరంగా చూసుకుంటే కేజీఎఫ్-2 మూవీ తెలుగులో రూ.185 కోట్లని కలెక్ట్ చేయగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రొబో, రొబో 2.0 వరుసగా రూ.100 కోట్లు, రూ.72 కోట్లతో టాప్-3లో ఉన్నాయి. తాజాగా కాంతారా రూ.65 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లలో కాంతారా మూవీ కొనసాగుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ రిలీజ్ చేసారు.