కరోనా వ్యాక్సిన్‌ వాస్తే..ధరపై కీలక అంశాలే

కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ముందంజ..ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్

corona vaccine

లండన్‌: ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేసుంది. దీంతో యావత్‌ ప్రపంచం కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నా, ఈ రేసులో అందరికంటే ముందున్నది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనే. ఈ వర్సిటీ పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్ ను ఇప్పటికే కోతులపైనా ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం మానవులపై పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ ఆడ్రియన్ హిల్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

సాధ్యమైనంత విస్తృతస్థాయిలో వ్యాక్సిన్ ను అందించాలన్నది తమ లక్ష్యమని, ధర మరీ ఎక్కువ కాకుండా ఉండేందుకు వీలుగా భారీగా ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకు లభ్యమైతే వీలైనంత ఎక్కువమందికి చేరుతుందని, ఆ దిశగానే తమ పరిశోధనలు సాగుతున్నాయని హిల్ వివరించారు. ప్రయోగాలు కొనసాగుతున్నాయంటే ఇందులో నిరాశ కలిగించే అంశాలేవీ లేనట్టేనని భావించాలని పేర్కొన్నారు. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అని, ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో తయారుచేస్తాం కాబట్టి అన్ని దేశాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/