రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీభత్సం..20 కార్లు ధ్వసం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ కారు బీబత్సం సృష్టించింది. డ్రైవర్ కు సడెన్ గా ఫిట్స్ రావటంతో కారు అదుపుతప్పి ఏకంగా 20 వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, బైకులు మొత్తం కలిసి 20 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన తో అక్కడి స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తి కారులో చేవెళ్ల వెళ్తున్నాడు. కారు జర్నలిస్టు కాలనీకి రాగానే అతడికి ఫిట్స్ వచ్చాయి..దీంతో కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, బైకులు మొత్తం కలిసి 20 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే.. ప్రమాద సమయంలో రోడ్డుపై జనాలేవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం జరగలేదు.

ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. కారు డ్రైవర్ రాజశేఖర్‌కు స్వల్పంగా గాయాలు కావటంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.