ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేందర్ అరెస్ట్

పాల్వంచలో వనమా రాఘవేందర్ పై కేసు నమోదు


హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడిన కేసులో కీలక పరిణామం చోటుచేసుంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని వివరణ ఇచ్చేందుకు వనమా రాఘవేందర్ హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు.

తాను ప్రెస్ క్లబ్ కు వస్తున్నానంటూ మీడియా ప్రతినిధులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలో అతడి ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు నారాయణగూడ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాఘవేందర్ ను కొత్తగూడెం జిల్లాకు తరలిస్తున్నారు. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులోనూ వనమా రాఘవేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇప్పటికే ఆయనపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/