ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

బాధిత కుటుంబం సింహాచలం నుంచి ఒడిశాలోని బరంపురుంకు వెళ్తుండగా ఈ ప్రమాదం

car-accident
car-accident

మందస: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస కొత్తపల్లి బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. నలుగురు మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఇద్దరి కోసం కాలువలో గాలిస్తున్నారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబం సింహాచలం నుంచి ఒడిశాలోని బరంపురుంకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/