రేషన్ కార్డు లేనివారు ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకోవచ్చా..?

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు వంటివి అమలు చేయగా..ఇక ఇప్పుడు ప్రజా పాలనా కార్య్కర్మం ద్వారా ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తు పత్రాలను స్వీకరిస్తుంది. ఈ క్రమంలో ఈ దరఖాస్తు పత్రాల ఫై ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

రేషన్ కార్డు ఉన్న వారే అభయ హస్తం కు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగడం తో.. రేషన్ కార్డు లేని వారు మా పరిస్థితి ఏంటి అని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మిగతా వాళ్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ క్రమంలో అనేక మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటూ అభయహస్తం గ్యారెంటీలకూ అప్లై చేసుకుంటున్నారు.

రేషన్ కార్డు లేని కొందరు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ను, మరికొందరు క్యాస్ట్ సర్టిఫికేట్‌ను జత చేస్తుండటం తో దీనిపై కూడా ప్రభుత్వ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి సర్టిఫికేట్‌స్ అవసరం లేడనై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఏ వర్గమో చెబితే సరిపోతుందని అన్నారు.