RGV ఫై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫై చర్యలు తీసుకోవాలంటూ బర్రెలక్క..మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు’ అంటూ వర్మ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బర్రెలక్క. వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినా బర్రెలక్క..రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వార్తల్లో నిలిచారు. ఈమె వెనుక విద్యార్థి సంఘాలు , పలు సేవ సంఘాలతో పాటు పలువురు రాజకీయ నేతలు సపోర్ట్ గా నిలిచారు. అధికార , ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి పోటీ అనేది ఇవ్వక పోయిన దాదాపు ఏడు వేల ఓట్లు సాధించుకుంది.

ఇక వర్మ తెరకెక్కించిన వ్యూహం విషయానికి వస్తే..జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈరోజు ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా..తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించారని నారా లోకేష్ హైకోర్టు ను ఆశ్రయించగా..కోర్ట్ రిలీజ్ కు బ్రేక్ వేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.