తెలంగాణ లో ఆ 13 నియోజకవర్గాల్లో పోలింగ్ గంటముందే ముగియనుంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం రానేవచ్చింది. ఎల్లుండి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబదించిన పోలింగ్ జరగనుంది. నెల రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తూ వస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రంతో ఆ ప్రచారానికి తెరపడనుంది. నెల రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థుల్లో..ఎవరికీ ఓటు వేస్తారనేది చూడాలి.

మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. ఈ క్రమంలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచార గడువు ముగియనుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఆ మరుక్షణం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. సాయంత్రం 5 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, నిర్వహించకూడదు అని తెలిపారు.