జేసీ బ్రదర్స్‌పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆగ్రహం

జేసీ బ్రదర్స్ ఫై అలాగే టీడీపీ పార్టీ ఫై వైస్సార్సీపీ యువనేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విరుచుకపడ్డారు. జేసీ బ్రదర్స్‌కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని , టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. గురువారం అనంతపురంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ..రాయలసీమ ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీకి అసలు అభ్యర్థులు అంటూ లేరని ఎద్దేవా చేసారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో శాంతి నెలకొందని , సీఎం జగన్ హయాంలో హత్యా రాజకీయాలు లేవని సిద్దార్థ్ రెడ్డి అన్నారు.

తాడిపత్రి నియోజకవర్గంలో 2019కు ముందు 30 ఏళ్లు పాటు రాచరిక పాలన నడిపారని .. ఇప్పుడు రాయలసీమలోని 30 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరని సెటైర్లు వేశారు. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్యారెక్టర్.. ‘రంగం’ అనే తమిళ్ డబ్బింగ్ సినిమాలో విలన్ వంటిదని వ్యాఖ్యానించారు. రంగం సినిమాలో విలన్ బయటికేమో ఉద్యమం, పోరాటం అంటాడని.. లోపలేమో ఉగ్రవాదులతో పొత్తుపెట్టుకుని ఉంటాడని.. పవన్ కళ్యాణ్ కూడా అంతే అన్నారు. ఇక సీఎం జగన్ అధికారంలో ఉన్న లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని బైరెడ్డి అన్నారు.