కోడిగుడ్లను కొట్టేసిన హెడ్ కానిస్టేబుల్ : చివరకు సస్పెన్షన్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Head Constable who stole eggs
Head Constable who stole eggs

Chandigarh: హెడ్ కానిస్టేబుల్ రోడ్డుపై కోడిగుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఫతేగఢ్ సాహిబ్ టౌన్‌లో ఈ తంతు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణను ప్రారంభించారు.
ఆ కానిస్టేబుల్ పేరు ప్రీత్‌పాల్ సింగ్. కోడిగుడ్ల రిక్షా రోడ్డు పక్క ఆగి ఉండగా, ప్రీత్‌పాల్ సింగ్. నాలుగు గుడ్లను ప్యాంటు జేబులో వేసుకున్నాడు. రిక్షా యజమాని రావడంతో ఎదురుగా వస్తున్న మరో రిక్షాను ఆపి ఎంచక్కా దానిపై వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. చివరకు అది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. గుడ్ల చోరీని తీవ్రంగా పరిగణించిన ఆధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/