తేజు హాస్పటల్ లో ఉంటె..బన్నీ ‘సిటీమార్’ ను ఎంజాయ్ చేస్తున్నాడు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ..పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజు గాయపడి..ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. తేజు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి మెగా ఫ్యామిలీ మొత్తం హాస్పటల్ కు వెళ్ళింది ఒక్క అల్లు అర్జున్ తప్ప. తేజు కు ఎలా ఉందో అని చిత్రసీమ ప్రముఖులు , మెగా అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఆరా తీశారు. సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున తేజు కోలుకోవాలని ట్వీట్స్ చేసారు. ఇంత జరుగుతున్న అల్లు అర్జున్ మాత్రం కనీసం సోషల్ మీడియా లో తేజు గురించి ఒక్క ట్వీట్ చేయలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ..పుష్ప చిత్రీకరణలో భాగంగా శనివారం కాకినాడ కు వెళ్లారు.

కాకినాడ లో కాలక్షేపం కోసం గోపీచంద్ నటించిన సిటీమార్ మూవీ చూసారు. పద్మ ప్రియ హాల్లో మ్యాట్ని షో చూసి సినిమా బాగుందని తెలిపారు. అయితే తేజు ప్రమాదం జరిగి హాస్పటల్ లో ఉంటె కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు. ఇలాంటి సమయంలో హ్యాపీ గా సినిమా కు వెళ్లాడని మెగా అభిమానులు బన్నీ ఫై ఫైర్ అవుతున్నారు. సామాన్య అభిమానుడికి ఉన్న బాధ్యత బన్నీ కి లేదే అని అంటున్నారు. పర్సనల్ గా కాల్ చేసి ఎలా ఉందని అడగొచ్చు..కానీ ఒక్క ట్వీట్ పెడితే అభిమానులంతా హ్యాపీ గా ఫీల్ అయ్యేవారు కదా అని సామాన్య అభిమాని ఆవేదన.

ఇక తేజు ఆరోగ్యం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కాలర్ బొన్ సర్జరీ చేస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో సర్జరీ పూర్తి చేయనున్నారు. నిన్న, ఈ రోజు వెంటిలేషన్ తీస్తున్నప్పుడు ‘నొప్పిగా ఉంది’.. అంటూ తేజ్ అన్నట్టు డాక్టర్లు తెలిపారు. అంతేకాదు వెంటిలేటర్ తీసినప్పుడు స్ప్రహలోకి కూడా వస్తున్నారు. అయితే రెండు రోజుల తర్వాత కాలర్ బోన్ సర్జరీ చేయాలనుకున్న డాక్టర్లు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చేస్తున్నారు.