కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్‌ సమయం కుడా ఇవ్వడంలేదు

Adarsh Shastri
Adarsh Shastri

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనవడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదర్శ్‌ శాస్త్రి ఆప్‌కి గుడ్‌బై చెప్పి శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్‌ సమయం కూడా ఇవ్వలేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌ టికెట్‌ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ద్వారక్‌ నియోజకవర్గ టికెట్‌ను తిరిగి తనకు ఇచ్చేందు కేజ్రీవాల్‌ రూ.10 నుంచి 15 కోట్లు డిమాండ్‌ చేశారని ఆదర్శ్‌ శాస్త్రి ఆరోపించారు. దీంతో షాక్‌కు గురయ్యానని, అంత డబ్బు కేజ్రీవాల్‌కు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనకు టికెట్‌ దక్కలేదని వాపోయారు. తన స్థానంలో విన§్‌ు మిశ్రాకు స్థానం కేటాయించారని తెలిపారు. కాగా ఆదర్శ్‌ వ్యాఖ్యలు డీల్లీ రాజకీయాలలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/