బిగ్ బాస్ 5 : ఆ బూతుల బ్యూటీ పోయినట్లేనా..?

బిగ్ బాస్ 5 మొదలవ్వడమే కాదు ఒకరు హౌస్ నుండి వెళ్లే సమయం కూడా వచ్చేసింది. బిగ్ బాస్ 5 మొదలై అప్పుడే వారం కావొస్తుంది..మొత్తం 19 మంది సభ్యులతో బిగ్ బాస్ మొదలవ్వగా..మొదటివారం ఒకరు హౌస్ ను విడిచిపెట్టబోతున్నారు. మొదటివారానికి గాను ఆరుగురు సభ్యులు నామినేషన్లో ఉన్నారు. యాంకర్ రవి , కాజల్ , మానస్ , జాస్వంత్ , హమీద , సరియు లు ఉండగా వీరిలో ఒకరు ఈ వారం ఇంటికి వెళ్లబోతున్నారు.

శాయంవరం నాటి ఎపిసోడ్ లో ఆరుగురిలో ఇద్దర్ని సేవ్ చేశారు నాగార్జున. మొదటి రవి సేఫ్ జోన్‌లోకి రాగా.. తరువాత హమీదా సేఫ్ అయ్యింది. దీంతో మానస్, సరయు, జెస్సీ, కాజల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు ఈరోజు ఎలిమినేషన్ కాబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న లీకులను బట్టి చూస్తే ఈవారం ఎలిమినేషన్‌లో యూట్యూబ్ సంచలనం సరయు ఎలిమినేషన్ అకాబోతున్నట్లు పక్కాగా తెలుస్తుంది. జెస్సి ఎలిమినేట్ అవుతాడని అన్ని పోల్స్‌లోనూ స్పష్ఠమైన అభిప్రాయాలను వచ్చాయి.

అయితే అతనికి బదులుగా సరయుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ గట్టి షాకే ఇస్తున్నారట. గత వారం రోజులుగా చూస్తే.. సరయుకి స్క్రీన్ స్పేస్ అస్సలు ఇవ్వకపోవడం.. చూపించిన ప్రతిసారి ఆమెను నెగిటివ్ గానే చూపించడం లాంటివి చేశారు బిగ్ బాస్. దీనిబట్టి చుస్తే సరియును ఇంటికి పంపించేందుకు బిగ్ బాస్ డిసైడ్ అయినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఏంజరగబోతుందో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.