ట్విట్టర్ లో రామ్ చరణ్ పేరిట ఉన్న రికార్డు ను బ్రేక్ చేసిన అల్లు అర్జున్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్..తాజాగా ట్విట్టర్ లో రామ్ చరణ్ పేరిట ఉన్న రికార్డు ను బ్రేక్ చేసాడు. నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా పుష్ప మేకర్స్ ..శుక్రవారం పుష్ప 2 ట్రైలర్ తో పాటు సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గంగమ్మ జాతర అమ్మవారి లుక్ లో ఉన్న అల్లు అర్జున్ కు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ , ట్రైలర్ తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘పుష్ప2.. ద రూల్ బిగిన్స్’ అంటూ విడుదలైన ఈ లుక్.. ట్విట్టర్ లో ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ట్విట్టర్ లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధిక లైకులు సాధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గా నిలిచింది. ఇప్పటి వరకు రాంచరణ్ గేమ్ ఛేంజర్ పోస్టర్ పేరిట ఉన్న ఈ రికార్డును పుష్ప రాజ్ బీట్ చేశాడు. 24 గంటలు గడవక ముందే రెండు లక్షలకు పైగా లైకులు పొందిన ఫస్ట్ లుక్ కూడా ఇదే కావడం విశేషం.

అలాగే పుష్ప 2 ట్రైలర్ సైతం యూట్యూబ్ లో తెలుగు కు 18 మిలియన్ల వ్యూస్ వస్తే.. హిందీ టీజర్ కు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నార్త్ ఆడియెన్స్ లో పుష్ప క్రేజ్ కు ఇది నిదర్శనం అని అభిమానులు అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.