మాదాపూర్ లో సెక్స్ రాకెట్ ను గుట్టు రట్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ మాదాపూర్ లో గుట్టుచప్పుడు కాకుండా బ్యూటీ సెలూన్ పేరిట వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పా సెంటర్, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచార నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి పోలీసులు ఒక్కసారిగా సెలూన్ ఫై దాడి చేయగా..వారికీ దిమ్మతిరిగే వాస్తవాలు కనిపించాయి.

లోపలి వెళ్లేసరికి , 10మంది విటులు, 10మంది యువతులు కనిపించారు. దీంతో వారితో పాటు ప్రధాన నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి రూ.73వేల నగదు, 28 మొబైల్ ఫోన్లు, ఓ కారు, రూ.4లక్షలు బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఒక్క మాదాపూర్ లోనే కాదు ప్రతి ఏరియాలోని స్పా సెంటర్, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. విదేశీ యువతులను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. బయటకు మాత్రం సెలూన్..లోపల మాత్రం వ్యభిచారం చేయిస్తున్నారు.