హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్

Bumper offer for Hyderabad Metro passengers

Community-verified icon


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో. హైదరాబాద్ మెట్రో రైల్ లాయల్టీ బోనస్‌ను ప్రకటించింది. లాయల్టీ కస్టమర్లకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. అధికారులు ఈ మేరకు ఎంపిక చేసిన స్మార్ట్ కార్డ్ ఐడీల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. రెగ్యులర్ మెట్రో ప్రయాణికులు ఈ ఐడీ కార్డుల వివరాలను చేసుకోవచ్చు. వారి కార్డు వివరాలను వీటితో మ్యాచ్ అయితే వారికి లాయల్టీ బోనస్ బెనిఫిట్ లభిస్తుంది.

మీ ఐడీ ఎంపిక చేసిన నెంబర్లలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఐడీ నెంబర్ ఎంపిక చేసిన స్మార్ట్ కార్డు ఐడీల లిస్ట్‌లో ఉంటే.. వెంటనే మీ వివరాలను 040 23332555 నెంబర్‌కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 7995999533 అనేది వాట్సాప్ నెంబర్. ఈ వివరాలను హైదరాబాద్ మెట్రో రైల్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

హైదరాబాద్ మెట్రో అధికారులు ‘లాయల్టీ బోనస్’ ప్రకటించిన ఐడీ నెంబర్లు ఇవే:

  1. 10100003890119
  2. 101000010715659
  3. 10100001417850
  4. 10100004374980
  5. 10100000006433
  6. 10100001930276
  7. 10100002449022
  8. 101000011214385
  9. 10100002975875