గుత్తికోయలకు ఎటువంటి హక్కులూ లేవన్న మంత్రి సత్యవతి

గుత్తికోయలు.. ప్రస్తుతం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ హత్యతో గుత్తికోయలు పేరు మారుమోగిపోతుంది. భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్‌ రేంజర్ శ్రీనివాస్ రావు ను అతి దారుణంగా గుత్తికోయలు నరికి చంపారు. దీంతో అటవీ అధికారులు గుత్తికోయలు నుండి తమకు ప్రాణ హాని ఉందని..ప్రభుత్వం గుత్తికోయలు విషయంలో ఓ నిర్ణయం ప్రకటించాలని కోరుతూ పోడు భూముల సర్వ్ కు వెళ్ళమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో మంత్రి సత్యవతి.. పోడు భూముల కోసం గుత్తికోయలు చేస్తున్న పోరాటంపై స్పందించారు. వారి పోరాటంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గుత్తి కోయలు ఈ రాష్ట్రానికి చెందిన వారే కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్ర గిరిజనులే కాని గుత్తికోయలకు పోడు భూముల పట్టాలు వర్తించవని, ఏ రిజర్వేషన్లూ అప్లై కావని స్పష్టం చేశారు. ఫారెస్టు అధికారులపై జరుగుతోన్న దాడులను మంత్రి తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మరోపక్క ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ హత్యతో.. అటవీశాఖ అప్రమత్తమైంది. ఆపరేషన్‌ వెపన్స్‌ షురూ చేశారు ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు. గుత్తికోయలు ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల్లో విల్లంబులు, బల్లెంలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గుత్తికోయల దగ్గర ఆయుధాలు లేకుండా దాడులకు ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు.