ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Technical error in Army helicopter..Emergency landing

రాజౌరి : భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్‌ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్‌ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బనీ తాలూకా హతాల్‌ గ్రామ శివార్లలో హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయ్యింది. అనంతరం నిపుణుల టీమ్ ఘటనా ప్రాంతానికి వెళ్లి హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసిందని ఇండియన్‌ ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత చాపర్‌ ఘటనా ప్రాంతం నుంచి బయలుదేరి గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు.