భార‌త భూభాగంలో చైనా గ్రామం:భార‌త్ స్పంద‌న

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద చైనా నిర్మాణాలు
వివాదాస్ప‌ద ప్రాంతంలో గ్రామం నిర్మాణం
ఆ గ్రామం దాదాపు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉందన్న భార‌త్

న్యూఢిల్లీ: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద చైనా నిర్మాణాలు చేప‌డుతూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఓ గ్రామాన్ని నిర్మించిన విష‌యంపై అమెరికా స్పందిస్తూ.. ఆ గ్రామాన్ని భార‌త భూభాగంలోనే నిర్మించింద‌ని పేర్కొంది. అమెరికా ఇటీవల విడుద‌ల చేసిన‌ అంతర్గత నివేదికలో ఈ అంశం ఉంది. అయితే, అమెరికా పేర్కొన్న అంశంపై భార‌త్ స్ప‌ష్ట‌త నిచ్చింది.

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద ప్రాంతంలో చైనా నిర్మించిన ఆ గ్రామం దాదాపు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉందని భారత భద్రతా దళ వ‌ర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలోని భారత అసోం రైఫిల్స్‌ పోస్ట్‌ను 1959లో చైనా సైన్యం ఆక్రమించుకుందని పేర్కొంది. ఆ ఘ‌ట‌న‌ను లాంగ్జూగా పేర్కొంటార‌ని తెలిపింది. 1959 నుంచి ఆ ప్రాంతం చైనా ఆక్రమణలోనే ఉందని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/