రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఎస్ఐ చొక్కా ప‌ట్టుకున్న‌ రేణుకా చౌద‌రి

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ వేధింపులకు నిరసనగా చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను రాజ్ భవన్ కు వెళ్లనీయకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి. అయితే ఈ నేపథ్యంలో జరిగిన వాగ్వాదాల సమయంలో కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకోగా, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలపై పోలీసులు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/