బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తన సముద్ర తూర్పు తీరంలో స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఆదివారం ప్రయోగించింది. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విన్యాసాలకు అమెరికా సిద్ధమవడం, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ త్వరలో పర్యటనకు రానున్న నేపథ్యంలో క్షిపణి ప్రయోగం రెచ్చగొట్టే చర్యగా భావిస్తున్నట్టు దక్షిణ కొరియా తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/