బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖగారియా ప్రాంతంలో ట్రాక్టర్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో మొదలుపెట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈరోజు ఉదయం మాకు ఖగారియా ప్రాంతంలో కారు, ట్రాక్టర్ ఢీకొట్టుకున్నట్లు సమాచారం అందింది. వెంటనే మేం ఘటనాస్థలికి చేరుకున్నాం. మేం వచ్చే సరికే కొంత మంది స్పాట్ డెడ్ అయ్యారు. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. కొందరు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. మొత్తం ఏడుగురు మరణించారు. వారిలో నలుగురు చిన్నారులున్నారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.