సంతోష్‌బాబు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

కొనసాగుతున్న అంతిమయాత్ర

సంతోష్‌బాబు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
Leaders-Pay-Tributes-to-Army-officer-Santosh-Babu
సంతోష్‌బాబు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

సూర్యాపేట: కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి ఈ ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. సంతోష్‌ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంతోష్‌ బాబు అమర్‌ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా మరికాసేపట్లో కేసారంలోని సంతోష్ బాబు కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూర్యాపేట నుండి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/