హుజురాబాద్ ఉప పోరు : యాదవుల కోసం రంగంలోకి ‘దత్తన్న’..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల హోరు నడుస్తుంది. తెరాస ను వీడి బిజెపి లో చేరిన ఈటెల రాజేందర్..ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలిచి తెరాస అధినేతకు బుద్ది చెప్పాలని స్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఆ ఛాన్స్ ఈటెలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని కేసీఆర్ వ్యూహరచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈటెల కు పోటీగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను దింపిన కేసీఆర్..దళితుల కోసం దళితబందును తీసుకొచ్చి వారి ఓట్లు కూడా తెరాస కు పడేలా చేసారు.

మరోపక్క బిజెపి సైతం భారీ ప్లాన్లే చేస్తుంది. ఇప్పటికే తెరాస కు పోటాపోటీగా ప్రచారం చేస్తూ వస్తుండగా..ఇప్పుడు దత్తన్నను రంగంలోకి దింపుతుంది. కేసీఆర్ యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో..బీజేపీ పార్టీ.. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయను రంగంలోకి దింపుతుంది. రేపు (ఆగస్టు 26) జమ్మికుంటలో బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సత్కారం చేయనున్నట్లు మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ తెలిపారు. పార్టీలకు అతీతంగా గొల్ల కుర్మలందరూ ఈ కార్యక్రమానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ ఈ ప్లాన్ చేసినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద హుజురాబాద్ ఉప పోరు గట్టిగా నడుస్తుందని చెప్పకతప్పదు.