ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మైనంపల్లి, రేఖానాయక్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యముగా బిఆర్ఎస్ టికెట్ రాని నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరి , టికెట్ పొందుతున్నారు. రీసెంట్ గా తుమ్మల చేరగా..ఈరోజు మైనంపల్లి, రేఖానాయక్ లు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.

అధికార పార్టీలో నిరుత్సాహం.. కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభించడంతో ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నవారిలో మైనం పల్లి.. ఆయన కుమారుడు రోహిత్, రేఖా శ్యామ్ నాయక్, నకిరేకల్ వేముల వీరేశం, కుంభం అనిల్ (భువనగిరి), అరేపల్లి మోహన్ (మానకొండూర్) ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని తెలుస్తుంది.