బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో ప్లెక్సీల రచ్చ

ఇప్పటికే రెండుసార్లు అధికారం దక్కించుకున్న బిఆర్ఎస్ (టిఆర్ఎస్) మూడోసారి అధికారంలోకి రావాలని గట్టిగ ట్రై చేస్తుంది. గత రెండుసార్లు బిఆర్ఎస్ కు కాంగ్రెస్, బిజెపి పార్టీలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినప్పటికీ..ఈసారి ఆ రెండు పార్టీలు గట్టిగానే పోటీ ఇస్తున్న తరుణంలో కేసీఆర్..ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే నేతలను ప్రజల మధ్య ఉండాలని సూచించారు. అందుకోసం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పేరుతో డివిజన్ లలో కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే…కే‌సి‌ఆర్ సర్కార్ ప్రజలకు చేసిన మేలు..సంక్షేమం, అభివృద్ధి అందరికీ తెలిసేలా చెప్పడం..అలాగే విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం అంటూ కార్యక్రమం పెట్టారు. కానీ ఈ సమావేశాల్లో అనుకున్నట్లు జరగట్లేదు..పూర్తిగా రివర్స్ జరుగుతుంది. ఒక్కో చోట ఒక్కో వివాదం వెలుగులోకి వస్తుంది. నేతలు ఎంతసేపటికి కే‌సి‌ఆర్ కు భజన చేస్తున్నారు తప్ప…కే‌సి‌ఆర్ చేస్తున్న పనులు ఏంటో ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయడం లేదని .. కే‌సి‌ఆర్ దృష్టిలో పడాలని పోటీ పడి మరీ భజన చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తుంది.

మరోపక్క పార్టీలో ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఫ్లెక్సీల్లో తమ బొమ్మలు లేవని కొందరు అలుగుతుంటే..తమని కార్యక్రమానికి పిలవలేదని మరికొందరు అలుగుతున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రెడ్యానాయక్ ఫోటోని ఫ్లెక్సీలో వేయలేదని, ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. మొత్తం మీద ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పార్టీలో ఉన్న విభేదాలు బయటకు వస్తున్నాయి.