దర్శనం మొగులయ్య కు ఇంటి స్థలం పత్రాలను అందజేసిన తెలంగాణ సర్కార్

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య కు తెలంగాణ సర్కార్ చెప్పినట్లే హైదరాబాద్ లో ఓ ఇంటి స్థలం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పలువురికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. అందులో మొగులయ్య కూడా ఉన్నారు. ఈ విషయం తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు.

స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కొందరికి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో స్థలాలు ఇచ్చారన్న బాలరాజు.. మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.