తారకరత్న తాజా హెల్త్‌ బులిటిన్ ను విడుదల చేసిన నారాయణ హృదయాలయ హాస్పటల్

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ చికిత్స పొందుతున్న తారకరత్న హెల్త్ కు సంబదించిన తాజా బులిటిన్ ను హాస్పటల్ వర్గం విడుదల చేసింది.. 20 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి తారకరత్న కు చికిత్స అందజేస్తూ వస్తున్నారు.

కాగా తారకరత్న హెల్త్ ఎలా ఉందనేది కొద్దీ రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హాస్పటల్ వర్గం తాజా హెల్త్ బులిటిన్ ను గురువారం విడుదల చేసింది. ఈరోజు తారకరత్నకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. తారకరత్నకు మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని ..దీనికి సంబదించిన పూర్తి వివరాలతో కూడిన మరో హెల్త్‌ బులిటెన్‌ అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.