తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు తేదీ పొడిగింపు

ఎంసెట్ కన్వీనర్ వెల్లడి

career
career

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ద‌ర‌ఖాస్తులకు గ‌డువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌లో జరుగుతాయని, పరీక్షలు మొత్తం 9 సెషన్లలో ఉంటాయన్నారు. . అగ్రికల్చర్‌ కు 3, ఇంజినీరింగ్‌ కు 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించాలని ఆలోచన చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. . ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయని, . విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు తేదీని మరోమారు పొడిగించినట్టు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/