సంయనం పాటించడం అవసరమన్న చిరంజీవి

గాడ్ ఫాదర్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..వరుస ఇంటర్వూస్ తో సినిమా ను ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మీడియా తో ముచ్చటించిన చిరు..పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఇటీవల గరికపాటి నరసింహారావు- చిరంజీవి ఇష్యూ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్న కు చిరంజీవి సమాధానం తెలిపారు.

“సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. మనం తప్పు చేయం.. చేస్తే వెంటనే పొరపాటు అయిపోయిందని అని ఒప్పుకునే మనస్తత్వం ఉన్నవాడు.. అవతలవాడు నీ తప్పులేకుండా ఏదైనా ఒక మాట అంటే, నీ మీద అభియోగాలు చేస్తే నువ్వు వెంటనే సమర్థించుకునేలా ఢీకొట్టాల్సిన అవసరం లేదు. నిజం నిలకడమీద తెలుస్తుందని పూర్తి స్థాయిలో నమ్మేవాడిని నేను. అలా నమ్మాను కాబట్టే నేను రాజకీయాల్లోకి వెళ్తాను అని తెలిసినప్పుడు నా బ్లడ్ బ్యాంక్ మీద, నా వ్యక్తిగత జీవితం మీద అభియోగాలు చేసినప్పుడు.. భూ కబ్జా చేశానని అన్నప్పుడు స్పందించలేదు. ఏదీ నిజం కాదు కాబట్టి నేను ఉలిక్కిపడలేదు’’ అని చిరంజీవి తెలిపాడు.

తన మీద అభియోగాలు చేసినవాల్లే నెమ్మదిగా వాళ్ల తప్పు వాళ్లు తెలుసుకున్నారని.. కోర్టుల ద్వారానో, వాళ్ల అంతరాత్మ ద్వారానో తప్పు తెలుసుకుని తనతో కలిశారని అన్నారు. ‘నన్ను ఎద్దేవా చేసినవారు కూడా రియలైజ్ అయ్యి నా దగ్గరకు వస్తే వాళ్లను ఆలింగనం చేసుకోవడం ఒక్కటే నాకు తెలిసిన ఫిలాసఫీ. దాని వల్ల నేను ఎక్కువ మంది మనసులను గెలుచుకున్నవాడిగా ఉన్నాను అని అన్నారు.